- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2 రూపాయలే కదా అని ఆ లింక్ క్లిక్ చేస్తే రూ. 2 లక్షలు కట్ అయ్యాయి.. తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన
దిశ, సినిమా: ఈ రోజుల్లో సైబర్ నేరాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. టెక్నాలజీ డెవలప్ అవుతన్న కొద్ది సైబర్ నేరగాళ్లు కూడా ఎక్కడ తగ్గకుండా కొత్త కొత్త ఐడియాలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సైబర్ ఉచ్చులో పడి లక్షలకు లక్షలు డబ్బులు పోగొట్టుకోగా.. తాజాగా బిగ్‌బాస్ ఫేం కీర్తిభట్ కూడా రూ. 2 లక్షలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ఒక ఇంపార్టెంట్ కొరియర్ రావాల్సి ఉండి.. అది వారం రోజులుగా రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకి కాల్ చేశాను. వాళ్లు డెలవరీ చేశాము.. మెహదీపట్నంలో ఉందని చెప్పారు. ట్రాక్ చేసి చూస్తే నిజంగానే మెహదీపట్నంలో ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత నాకొక కాల్ వచ్చింది. వాళ్లు హిందీలో మాట్లాడుతూ.. ‘మికొక కొరియర్ రావాలి కదా.. మీ లోకేషన్ అడ్రసె అప్‌డేట్ కాలేదు. ఒకసారి వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ పంపించండి’ అన్నారు. వారి చెప్పినట్లే చేశారు. తర్వాత మళ్లీ కాల్ చేసి మీ అడ్రస్ అప్‌డేట్ కావడం లేదు. ఒకసారి నార్మల్ మెసేజ్ చేయండి అంటే చేశాను. నాకు లింక్ వచ్చింది. అది కాపీ చేసి వాట్సాప్ నెంబర్‌కి పంపమన్నారు. తర్వాత ముందు పంపిన వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసి దాన్ని ఓపెన్ చెయ్యమన్నారు. అలాగే అడ్రెస్ అప్‌డేట్‌కు రూ. 2 ఎక్స్‌ట్రా కట్ అవుతుంది అన్నారు.
అయితే రెండు రూపాయలే కదా లింక్ క్లిక్ చేశాను. తర్వాత యూపీఐ ఎంటర్ చెయ్యమన్నారు. నాకు డౌట్ వచ్చి చేయనని చెప్పాను. అప్పుడు వాళ్లు బ్యాంక్‌కి లింక్ అయిన నెంబర్ ఇదేనా అని అడిగితే.. అవునని చెప్పాను. సరే మీకు మళ్లీ కాల్ చేస్తాం అని చెప్పారు. నాకు ప్రోససింగ్ అని పడింది. తర్వాతకి రెండు రూపాయలు కట్ అయ్యాయి. లైట్ తీసుకున్నాను. అర్థరాత్రి రూ. 99 వేలు కట్ అయ్యాయి. ఆ తర్వాతకి మరో రూ. 99 వేలు కట్ అయ్యాయి. నాకు ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే కార్తీక్‌కి కాల్ చేశాను. ఇద్దరం కలిసి సైబర్ కంప్లైంట్ ఇచ్చాము. వారు నా అకౌంట్‌ను బ్లాక్ చేయించారు. అలాగే వాళ్లను వీళైనంత తొందరగా పట్టుకుని నా డబ్బులు నాకు ఇప్పిస్తా అన్నారు. కానీ ఏది ఏమైనా ఇలాంటి సైబర్ క్రైమ్స్ భారీన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చింది కీర్తి.