రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేశాడు అందుకే లావయ్యానంటూ అరియానా సంచలన కామెంట్స్

by Anjali |   ( Updated:2024-08-07 13:34:04.0  )
రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేశాడు అందుకే లావయ్యానంటూ అరియానా సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: గత నెల రోజుల నుంచి రాజ్ తరుణ్-లావణ్య ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ప్రేయసి లావణ్య.. రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్స్ గురించి ఒక్కోక్కటిగా బయటపెడుతూ వస్తుంది. దీంతో సోషల్ మీడియాలో రాజ్ తరుణ్-లావణ్య హైలెట్‌గా నిలుస్తున్నారు. రీసెంట్ గా రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామీ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రాజ్ ను లావణ్య గురించి ప్రశ్నించారు. దీంతో హీరో మీడియా వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇకపోతే లావణ్య.. రాజ్ తరుణ్ పలువురు అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకుని నన్ను వదిలేశాడంటూ ఆరోపణలు చేస్తుంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో లవ్ లో ఉన్నాడని, వారి ఫ్యామిలీ కూడా లావణ్యను చంపేస్తానని బెదిరించారని వెల్లడించిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా బిగ్‌బాస్ ఫేమ్ అరియానాతో కూడా ఎఫైర్ ఉందని, రాజ్ తరుణ్ వల్ల అరియానా ప్రెగ్నెంట్ అయిందని, దీంతో లావయ్యిందంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. దీంతో తాజాగా అరియానా స్పందించి.. ‘నేను ఒక అమ్మాయిని, రాజ్ తరుణ్ వల్ల గర్భవతిని అయ్యాను. అబార్షన్ అయ్యింది అని చెప్పుకుని న్యాయం కావాలంటూ అడిగింది. అలాంటిది నా పై ఇలాంటి నీచమైన నిందలు ఎలా వేస్తుందో నాకు అర్థం కావడం లేదు.

దానికేమైనా పిచ్చా? బిగ్‌బాస్ నుంచి వచ్చాక నేను అబార్షన్ చేయించుకున్నాను. తర్వాత అమాంతం వెయిట్ పెరిగాను అంటుంది. నేను పెళ్లి చేసుకునే సమయం ఇది. ఇలాంటి సమయంలో నాపై ఇలాంటి నీచపు నిందలు వేయడం ఏ మాత్రం సరైంది కాదు. లావణ్య ఊహాగానాల వల్ల భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ అరియానా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని శేఖర్ భాషా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల శేఖర్ బాషాను కూడా లావణ్య చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story