- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ప్రారంభమయ్యేది ఆ రోజే.. లాంచింగ్ డేట్ అనౌన్స్ చేసిన నాగార్జున
Video Credits to Star Maa YouTube Channel
దిశ, సినిమా : స్మాల్ స్ర్కీన్ ఆడియెన్స్ ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూసే మోస్ట్ పాపులర్ అండ్ సీజనల్ ప్రోగ్రామ్‌లలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. కొన్ని రోజులుగా సీజన్ 8కు సంబంధించిన అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉందనే విషయమై కూడా పలువురి పేర్లతో కూడిన లిస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మేకర్స్ కూడా పలు ప్రోమోలతో హైప్ పెంచేస్తూ వస్తున్నారు. కాగా ఇప్పుడు మరో కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు.
ఇకపోతే బిగ్ బాస్ షో లోకి ఎంటరయ్యే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలోనూ పలువురి పేర్లతో కూడిన ఓ లిస్టు నెట్టింట వైరల్ అయింది. దీంతోపాటు పలువురు సీరియల్ నటీ నటులు, టాలీవుడ్ హీరో హీరోయిన్లు, యూట్యూబర్లు, ఇన్ స్టాగ్రామ్ స్టార్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ ప్రచారంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. దీంతో అటు కంటెస్టెంట్ల పేర్ల విషయంలోనూ, ఇటు బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం అయ్యే తేదీ, టైమింగ్ విషయంలోనూ ఆడియెన్స్‌లో క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోలలో కూడా ఈ విషయాలను ప్రస్తావించలేదు.
అయితే తాజాగా రిలీజ్ చేసిన ఓ కొత్త ప్రోమోతో ఆ సస్పెన్షన్‌కు తెరదించారు బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో మేకర్స్. ఎట్టకేలకు లాంచింగ్ డేట్ కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 1, ఆదివారం రాత్రి 7 గంటలకు షో ప్రారంభిస్తున్నట్లు స్వయానా అక్కినేని నాగార్జున అనౌన్స్ చేశారు. టోటల్ 1:40 నిమిషాల నిడివి కలిగిన ఈ ప్రోమోలో ‘‘ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే.. లిమిటే లేదు’’ అంటూ ఓల్డ్ ప్రోమో డైలాగ్‌ను కూడా నాగార్జన రిపీట్ చేశారు.