- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ స్ట్రీమింగ్ కోసం భారీగా అమ్ముడుబోయిన ‘సలార్’
దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తై.. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ యాక్షన్ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాని ‘సలార్’ కంటే ఒక రోజు ముందుగా షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ కూడా వస్తోంది. అయితే ఈ ఏడాది ‘పఠాన్’, ‘జవాన్’ మూవీలతో కెరీర్‌లో ఆల్ టైమ్ హిట్స్ సొంతం చేసుకొని ఊపు మీదున్న షారుఖ్‌తో ప్రభాస్ పోటీ పడటం కలెక్షన్లపై ప్రభావం చూపుతుందనే టాక్ వినపడుతుంది.
ఇకపోతే గతంలో ఒకసారి ‘సలార్’ ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్.. ఈ ‘సలార్’ హక్కులను మొత్తం రూ.350 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం బడ్జెట్ రూ. 200కోట్లు కాగా నిర్మాతలు రూ. 150 కోట్లు లాభం పొందినట్లే.
Read More..
ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ చేసిన మేకర్స్.. పోస్ట్ వైరల్!
- Tags
- prabhas