- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజలకు సిగ్గులేదు.. పనికిమాలినోళ్లు అంటూ తీవ్రంగా మండిపడ్డ బిగ్‌బాస్ శివాజీ
దిశ, సినిమా: అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. హీరోగా అవకాశాలు దక్కించుకున్నారు శివాజీ. ఈ నటుడు తీసిన కొన్ని సినిమాలైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రీసెంట్‌గా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హెల్త్ సహకరించకపోవడంతో శివాజీ పెద్దగా టాస్క్‌లు ఆడలేకపోయారు. అయినా కూడా ఫ్యాన్స్ శివాజీని చాలా బాగా సపోర్ట్ చేశారు. చివరికి టాప్ 3 కంటెస్టెంట్‌గా బయటకు వచ్చారు. ఈయన హౌస్ నుంచి బయటికి వచ్చాక.. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ఎక్కువగా రాజకీయాల గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి.
మీడియా అడిగే ప్రశ్నలకు శివాజీ ఆన్సర్ చెబుతూ ఏపీ ప్రజలపై దారుణంగా సీరియస్ అయ్యారు. ‘‘నా సమాధానం ఏంటంటే? అసలు పాలిటిక్స్ గురించి అడగడం వేస్ట్. ఒక్కో పార్టీకి ఒక్కో అభ్యర్థి మద్దతు ఇస్తుంటారు. వాళ్లంతా కలిసి నియోజకవర్గంలో మంచి అభ్యర్థి కావాలనుకుంటారు. ఈ రోజు ప్రజల కోసం 100 రూపాయలు పెడుతుంటారు. తర్వాత వారి నుంచి రెండు వందలు లాగేయానుకుంటారు. ప్రజల డబ్బుల గురించి రాజకీయ నాయకులు అస్సలు ఆలోచించరు. ప్రస్తుతం సమాజం బాగోలేదు. ప్రభుత్వం బాగోలేదు అనే హక్కు మీకు ఎక్కడ ఉందిరా పనికిమాలినోళ్లారా’’ జనాలకు కాస్తైన సిగ్గుండాలి. అంటూ ప్రజల ఆలోచనలపై శివాజీ మండిపడ్డారు.