‘ది భూమి ఫౌండేషన్’.. పుట్టినరోజున గొప్ప కార్యక్రమం చేపట్టిన బోల్డ్ బ్యూటీ

by Nagaya |   ( Updated:2023-07-18 14:11:25.0  )
‘ది భూమి ఫౌండేషన్’.. పుట్టినరోజున గొప్ప కార్యక్రమం చేపట్టిన బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తన పుట్టినరోజు సందర్భంగా ఓ గొప్ప కార్యక్రమం చేపట్టింది. ఈ జూలై 18న 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమె.. 2019లో క్లైమేట్ వారియర్ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ యేడాది బర్త్ డే స్పెషల్‌గా నిలిచిపోయేలా ‘ది భూమి ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించి తన సంపాదనలో కొంత భాగాన్ని దానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ‘ఈ భూ గ్రహం పట్ల అపారమైన కృతజ్ఞత, ప్రేమతో నా పుట్టినరోజున దీనిని ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇది లాభాపేక్షలేని సంస్థ. మన అందమైన గ్రహాన్ని సంరక్షించడానికి భూమి ఫౌండేషన్ కోసం కలిసి పని చేద్దాం. వాతావరణ యోధులుగా, పర్యావరణ పరిరక్షణలో దృఢ విశ్వాసం ఉన్న వ్యక్తులుగా, మన గ్రహం కాపాడేందుకు మనవంతు ప్రభావం చూపాలని ఎప్పుడూ కలలు కంటుంటాను. ఈ కొత్త ప్రయాణానికి మీ అందరి ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలు కావాలి’ అంటూ ట్విట్టర్ వేదిక ఫౌండేషన్ ఫొటో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి: బూబ్స్, బ్యాక్ లేకున్నా సెక్సీ అంటే ఆశ్చర్యమేస్తుంది.. Emma Watson

Advertisement

Next Story