ఒకేరోజు మూడువేల మొక్కలు నాటిన భూమి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Anjali |   ( Updated:2023-06-07 14:25:00.0  )
ఒకేరోజు మూడువేల మొక్కలు నాటిన భూమి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 3,000 మొక్కలు నాటినట్లు తెలిపింది భూమి పెడ్నేకర్. ప్రతి యేడాది జూన్ 5న జరుపుకునే ఎన్విరాన్‌మెంట్ డేను పురష్కరించుకుని ఈ యేడాది మహారాష్ట్ర అంతటా వేల సంఖ్యలో మొక్కలను నాటినట్లు చెప్పింది. ‘వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే రోజున భూమిని పరిశుభ్రమైన, పచ్చని గ్రహంగా మార్చేందుకు నేను నా వంతు కృషి చేస్తున్నాను. నేను దీన్ని నిరంతరం కొనసాగిస్తాను. ఇతరులు కూడా చేస్తారని, చేయాలని ఆశిస్తున్నా’ అంటూ తన అభిమానులు సాధ్యమైనన్ని చెట్లను పెంచాలని కోరింది. కాగా దీనిపై స్పందిస్తున్న సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Click here for Instagram link

Advertisement

Next Story