Bharateeyudu 3: అంచనాలను భారీగా పెంచుతున్న భారతీయుడు 3

by Prasanna |   ( Updated:2024-07-18 13:07:36.0  )
Bharateeyudu 3: అంచనాలను భారీగా పెంచుతున్న భారతీయుడు 3
X

దిశ, సినిమా: భారతీయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. తాజాగా భారీ అంచనాల నడుమ భారతీయుడు 2 మూవీ మన ముందుకొచ్చింది. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. కలెక్షన్స్ కూడా డల్ అయ్యాయి. కథ పరంగా బాగానే ఉన్నా ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు అయితే ఈ క్రమంలో భారతీయుడు 2 ముగిసే ముందు ఎండింగ్‌లో సర్‌ప్రైజ్‌ చూసి కమల్ అభిమానులు సంతోషంగా ఫీల్ అయ్యారు.

ఎవరు ఊహించలేని విధంగా భారతీయుడు 3 ట్రైలర్‌ వదిలి అందర్ని షాక్ కి గురయ్యేలా చేసారు డైరెక్టర్ శంకర్. ఇంత వరకు ఏ దర్శకుడు చేయని సాహసం చేసినట్టుగా తెలుస్తుంది. పార్ట్‌ 2 ఎండింగ్ ని పార్ట్ 3 ట్రైలర్ తో ముగించాడు. ఇంత క్లారిటీని మెయింటైన్ చేస్తున్న శంకర్, కమల్ హాసన్ కు బిగ్ హిట్ అందిస్తాడో.. లేదన్నది చూడాల్సి ఉంది. ఈ స్టోరీలో కమల్ యువకుడు లా కనిపించనున్నాడు. అంతే కాకుండా కాజల్ కూడా పార్ట్ 3 లో అలరించనుంది.

Advertisement

Next Story