రణ్‌బీర్-అలియాకు షాక్ ఇచ్చిన భజరంగ్ దళ్.. చేసేదేమీ లేక

by Hamsa |   ( Updated:2022-09-07 09:00:08.0  )
రణ్‌బీర్-అలియాకు షాక్ ఇచ్చిన భజరంగ్ దళ్.. చేసేదేమీ లేక
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ - అలియా ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ అయాన్ ముఖర్జీతో కలిసి ఉజ్జయిని వెళ్లిన ఇద్దరు.. మహంకాళీ మాతను దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. అయితే అక్కడే ఉన్న భజరంగ్ దళ్ నాయకులు రణ్‌బీర్-అలియా దేవాలయంలోకి ప్రవేశించకూడదంటూ ఆందోళనకు దిగారు.

వారం క్రితం వీరిద్దరు బీఫ్, చికెన్, మటన్ తింటామని చెప్పడమే ఇందుకు కారణం కాగా మొత్తానికి వారి ప్రొటెస్ట్‌తో దంపతులు అమ్మవారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీని మాత్రం యాక్టివిస్టులు అనుమతించగా.. ఆలయంలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమ్మవారిని దర్శించుకున్నాక సరికొత్త శక్తి వచ్చినట్లుగా ఉందని తెలిపాడు.

Also Read : ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయిన అలియా..

Advertisement

Next Story

Most Viewed