రష్మికతో బెల్లంకొండ శ్రీనివాస్ డేటింగ్.. చాలాసార్లు ముంబై వెళ్లారట!

by Anjali |   ( Updated:2023-05-03 09:17:04.0  )
రష్మికతో బెల్లంకొండ శ్రీనివాస్ డేటింగ్.. చాలాసార్లు ముంబై వెళ్లారట!
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై బెల్లకొండ సాయి శ్రీనివాస్ స్పందించాడు. ఆయన నటించిన ‘ఛత్రపతి’ మే 12న విడుదలకానుండగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు హీరో. ఈ క్రమంలో తాజా సమావేశంలో డేటింగ్ ఇష్యూపై క్లారిటీ ఇస్తూ.. ‘ఇవన్నీ ఆధారంలేని పుకార్లు. ఎలా పుట్టుకొచ్చాయో నాకు తెలియదు. ఫేక్ రిలేషన్స్ క్రియేట్ చేయడం సరైనది కాదని నేను భావిస్తున్నా. కొంతకాలంగా ముంబై విమానాశ్రయంలో నటీనటులు కనిపిస్తే చాలు.. ఇవే రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. మేమిద్దరం చాలాసార్లు హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చాం.. వస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఒకరికొకరం ఎదురుపడుతూనే ఉంటాం’ అంటూ రూమర్స్‌ను కొట్టిపారేశాడు.

Read more:

అలాంటి వాళ్లకే అవకాశాలిస్తారా? బాధగా ఉందన్న నేహా

Advertisement

Next Story