బ్యూటీ సితార, పవర్ స్టార్ వారసుడు అకిరా కాంబినేషన్‌లో మూవీ!

by Jakkula Samataha |
బ్యూటీ సితార, పవర్ స్టార్ వారసుడు అకిరా కాంబినేషన్‌లో మూవీ!
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో మహేష్ బాబు గారాల పట్టీ సితార గురించి ఎంత చెప్పినా తక్కువే.జ్యూవెల్లరి యాడ్‌తో ఈ బ్యూటీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన గ్లామరస్ ఫొటోస్‌, డ్యాన్స్ ఫర్పామెన్స్‌లతో అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ సితార ఎప్పుడెప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం, ఓ యాంకర్ సితారను, మీరు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారా అని చెప్పగా, నేను ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారా అని చూస్తున్నాను. తప్పకుండా హీరోయిన్‌గా చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఒక వేళ సితార హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే, పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా హీరోగా ఉండాలంటూ ముచ్చటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా ప్రస్తుతం చదువుకుంటున్నాడు. త్వరలోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, మహేష్ బాబు కూతరు కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుడటంతో,అకీరా, సితార కాంబినేషన్‌లో సినిమా రావాలని వారు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story