- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pushpa-2: ‘పుష్ప-2’ నుంచి పవర్ ఫుల్ విలన్ పోస్టర్ రిలీజ్..
దిశ, సినిమా: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప ది రైజ్. ఈ మూవీలో బన్వర్ సింగ్ షెకావత్‌గా నటించి అందర్ని ఆకట్టుకున్నారు నటుడు ఫహాద్ ఫాజిల్. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా అదే కాంబినేషన్‌లో రూపొందుతోంది ‘పుష్ప-2: ది రూల్’. ఈ చిత్రంలో కూడా ఫహాద్ ఫాజిల్ పాత్ర అదే శైలిలో మరింత క్రేజీగా ఉండబోతుంది. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. గల్ల లుంగీ ధరించి.. ఒక చేతిలో గన్‌తో... మరో చేతిలో గొడ్డలితో ఫహాద్ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం పుష్ప-2 పతాక సన్నివేశాలు హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతున్నాయి. అత్యంత భారీ వ్యయంతో వేసిన సెట్‌లో ఈ చిత్రీకరణ కొనసాగుతుంది. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు యూనిట్ సభ్యులు. మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.