- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాబాయ్‌ని చూసి లేచి నిల్చున్న Jr.NTR.. పట్టించుకోకుండా వెళ్లిన బాలయ్య! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి ఫ్యామిలీ గురించి సినిమా అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత నాలుగైదు దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా రాణిస్తూ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల తారకరత్న మరణంతో బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌తో సహా నందమూరి కుటుంబంలోని నటులంతా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందమూరి కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యకు మధ్య చాలా గ్యాప్ వచ్చిందని వార్తలు విస్తృతమయ్యాయి.
ఈ వార్తలకు ఆజ్యం పోసే విధంగా తారకరత్న పెద్ద కర్మలో బాలయ్య వ్యవహరించిన తీరు అందరినీ షాక్‌కు గురి చేసింది. పెద్దకర్మకు వచ్చిన అతిథులను పలకరించడానికి వచ్చిన బాలయ్యను చూసి కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లేచి నిల్చున్నారు. వాళ్ల ముందు కూర్చున్న మహిళను పలకరించిన బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి నందమూరి అభిమానులు స్పందిస్తూ.. బాలయ్యపై విమర్శలు చేస్తుండగా.. వీళ్లకు ఈ పరిస్థితి రావడానికి నారా కుటుంబమే కారణమని కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
1.తండ్రికి ఇచ్చిన మాట కోసం, బాలయ్య ఎంత పని చేస్తున్నాడో తెలుసా?
2.ధనుష్ ‘సార్’ మూవీపై బాలయ్య రియాక్షన్ ఇదే..
Also Read..