'BABA ' మూవీ రీ రిలీ‌జ్‌కూ భారీ కలెక్షన్స్

by sudharani |
BABA  మూవీ రీ రిలీ‌జ్‌కూ భారీ కలెక్షన్స్
X

దిశ, సినిమా: రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా 'బాబా' సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. 4K టెక్నాలజీతో ఈ మూవీ తమిళంలో మరోసారి విడుదల చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సీన్స్‌కు ర‌జ‌నీకాంత్ స్వయంగా డ‌బ్బింగ్ చెప్పడంతో.. అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ మార్చడంతో మూవీపై క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. ఫస్ట్ డేనే అదిరిపోయే కలెక్షన్స్ దక్కించుకున్నది.

రూ. 1.4 కోట్లు ఈ సినిమా ద్వారా వసూలయ్యాయి. 2002లో సురేష్ కృష్ణ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీ ర‌జ‌నీకాంత్ స్వీయ నిర్మణం. భారీ అంచ‌నాల‌తో రిలీజైనప్పటికీ డిజాస్టర్‌గా నిల‌వ‌డంతో ఎగ్జిబిట‌ర్లకు, డిస్ర్టిబ్యూట‌ర్లకు ర‌జ‌నీకాంత్ డ‌బ్బులు తిరిగి చెల్లించారు. రీ రిలీజ్ మూవీ కూడా మంచి కలెక్షన్లను రాబడుతుండటం విశేషం. అందుకు కారణం.. ఏ మూవీ అయినా ప్రేక్షకులు చూసే విధానాన్ని బట్టి ఉంటుందని స్పష్టమవుతోంది.

Read More...

జపాన్‌లో RRR ఘనత.. రజనీకాంత్ రికార్డు బ్రేక్

Advertisement

Next Story

Most Viewed