- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా నాన్న చెప్పిన ఆ మాటే నా జీవితాన్ని మార్చేసింది.. ఆయుష్మాన్
దిశ, సినిమా: AAIndianAwards 2023లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ మోస్ట్ డిస్ట్రప్టివ్ బ్రాండ్ అవార్డును స్వీకరించిన తర్వాత ఛాలెంజింగ్ రోల్స్‌లో నటించాలని ఫిక్స్ అయినట్లు ఆయుష్మాన్ ఖురానా వెల్లడించాడు. ఇటీవల విడుదలైన ‘డ్రీమ్ గర్ల్ 2’ విజయాన్ని ఆశ్వాదిస్తున్న నటుడు ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలను షేర్ చేసుకున్నాడు. ‘నా కెరీర్ మొత్తం రిస్క్‌తో కూడినదే. ఎవరైన సరే రిస్క్ తీసుకోనంత వరకు మనుగడ సాగించలేరు. సాంప్రదాయ నటుడిగా పనిని ప్రారంభించిన నేను బుడి బుడి అడుగులేస్తూ సాంప్రదాయేతర యాక్టర్‌గానూ డెవలప్ అయ్యాను.
‘విక్కీ డోనార్’తో మొదలైన ఆ కల్చర్ ‘డ్రీమ్ గర్ల్ 2’తో మరింత ముందుకు సాగింది. మా నాన్న నాకు ఎప్పుడూ ‘పెహలే సరస్వతి ఆతీ హై బాద్ మే లక్ష్మీ ఆతీ హై’ అని చెప్పేవారు. ఆ దిశగానే నేను విజయం వైపు అడుగులు వేస్తున్నా’ అని చెప్పాడు. అలాగే ‘మీరు నమ్మరు కానీ ‘విక్కీ డోనర్’కు ముందు 5 చిత్రాలకు నో చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ సెలక్షన్ ఎల్లప్పుడూ విభిన్నంగా ఉండాలని కోరుకున్నా. లేకపోతే బయటి వ్యక్తి ఇండస్ట్రీలో నిలబటం కష్టం. అందుకే ప్రతి ఒక్కరూ కష్టపడి ప్రతిభను కనబరిస్తే విజయం తప్పా మరొకటి మీ దరిచేరదు’ అంటూ ఆదర్శ వంతమైన వ్యాఖ్యలు చేశాడు.