- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'అమిగోస్'ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: నందమూరి కళ్యాణ్ రామ్
దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ఒక సక్సెస్ మనలో కాన్ఫిడెన్స్ నింపుతుంది. 'బింబిసార' విజయమే ఆలస్యం చేయకుండా 'అమిగోస్' చిత్రం చేసేలా ప్రేరేపించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఎప్పటి నుంచో సినిమా చేద్దామనుకుంటున్న క్రమంలో ఈ కథ దొరికింది. ఇలాంటి ట్రిపుల్ రోల్ కాన్సెప్ట్‌లపైన ఎవరైనా కథలు చెబితే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అందుకనే కథ విన‌్న వెంటనే ఓకే చెప్పేశా. మూడు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇక కొత్తగా ఉండాలనే 'అమిగోస్' స్పానిష్ పదాన్ని టైటిల్‌గా పెట్టాం. 'ఎన్నో రాత్రులొస్తాయిగానీ' సాంగ్ వచ్చే సిచ్యువేషన్ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. థియేటర్స్‌లో ఆడియెన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తారు' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి: