అంజలి సైజులపై దారుణమైన కామెంట్స్.. దిగజారిపోవద్దంటు నటి ఫైర్

by Prasanna |   ( Updated:2023-08-08 11:31:25.0  )
అంజలి సైజులపై దారుణమైన కామెంట్స్.. దిగజారిపోవద్దంటు నటి ఫైర్
X

దిశ, సినిమా : కరణ్ జోహార్ తాజా చిత్రం ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది అంజలీ ఆనంద్. అయితే తన మొదటి సినిమాతోనే బాడీ షేమింగ్ ఎదుర్కోవడంతో నెటిజన్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న బ్యూటీ.. కెరీర్ ఎదుగుదల కోసం ఎన్నో కష్టాలు పడ్డానని, ఊహించని ఒడిదుడుకులను తట్టుకుని ఇంతదూరం వచ్చినట్లు చెప్పింది. ‘నన్ను ‘మోటు’, ‘గోలు’, ‘క్యూటీ’ అని పిలవడాన్ని పూర్తిగా ద్వేషిస్తున్నా. ప్రజలు నన్ను ఆ పేర్లతో పిలుస్తుంటే అసౌకర్యంగా అనిపిస్తోంది. మీరు ఎవరినైనా అగ్లీ అని పిలిస్తే తప్పకుండా వారు బాధపడతారు. అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడనని అనుకుంటారు? ప్రజలు దీనిని స్వీట్‌గా భావిస్తుండొచ్చు. కానీ ఇది డబుల్ స్టాండర్డ్స్. ప్రతి ఒక్కరికి ఏదో పేరు ఉంటుంది. కాబట్టి ఆ పేరుతోనే పిలవండి’ అని సూచించింది. ఇక ఈ మూవీలో తన నటనపై ప్రశంసలు వచ్చాయన్న ఆమె ఇది మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నట్లు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed