సాయితేజ్ కనీసం నన్ను కలవలేదు.. ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి కీలక వ్యాఖ్యలు

by Hamsa |   ( Updated:2023-04-27 05:05:26.0  )
సాయితేజ్ కనీసం నన్ను కలవలేదు.. ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు ఇటీవల ఘోర యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడే ఉన్న అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి ఆయనను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించి రక్షించాడు. అయితే సాయి ధరమ్ తేజ్ కోలుకున్న తర్వాత అబ్దుల్‌కు మెగా ఫ్యామిలీ లక్షల రూపాయలు, మంచి బంగ్లా ఇచ్చారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ వార్తలపై అబ్దుల్ స్పందించాడు.

అబ్దుల్ మాట్లాడుతూ.. ‘‘ సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన తర్వాత నన్ను ఎవరూ కలవలేదు. తేజ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఎవరూ కలవలేదు. తేజ్ నన్ను కలిసి ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలన్నీ అబద్దాలే. నాకు మెగా ఫ్యామిలీ సాయం చేసిందంటూ వచ్చిన ఫేక్ వార్తల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొదట ఒక షాపులో పని చేసేవాడిని. కానీ, మెగా ఫ్యామిలీ నాకు రివార్డు ఇచ్చిందంటూ ప్రచారం జరగడంతో మా కొలీగ్స్, బంధువులు అందరూ.. బాగా డబ్బు ఇచ్చారట జాక్ పాట్ కొట్టావ్ అని టార్చర్ పెట్టారు. అది భరించలేక అక్కడ ఉద్యోగం మానేశా. తర్వాత నాలుగైదు నెలలు ఖాళీగా ఉన్నా. నాకు ఎవరి నుంచి ఏ సాయం అందలేదు. ఎవరి నుంచి ఫోన్ రాలేదు. ఎవరూ ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. అయినా ఇప్పటికీ నా గురించి ఫేక్ ప్రచారం జరుగుతూనే ఉంది. దీనివల్ల ఇప్పటికే నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను. దయచేసి ఈ ప్రచారాన్ని ఆపేయండి’’ అంటూ అబ్దుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more :

ముఖంలో లేని అందం వక్షోజాల్లో ఉంటుందా..? చివరికి యోని కనిపించేలా సెలబ్రిటీస్ షో..!

పెళ్లి చేసుకునే వ్యక్తి అలా చూసుకోవాలి.. ఫైమా కోరికకు అంతా షాక్?

Advertisement

Next Story

Most Viewed