ఆ పార్ట్ చిన్నగా ఉండటంతో ఆఫర్లు రావడం లేదు.. సర్జరీ చేయించుకున్నానంటూ బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-07-13 09:36:58.0  )
ఆ పార్ట్ చిన్నగా ఉండటంతో ఆఫర్లు రావడం లేదు.. సర్జరీ చేయించుకున్నానంటూ బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న శ్రీసత్య తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా అందరి మనసులు దోచేసింది. ప్రస్తుతం పలు సినిమాలు, షోస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే శ్రీసత్య ఇటీవల పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కొందరు ఆమెను చండాలంగా ఉన్నావంటూ ట్రోల్స్ కూడా చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, శ్రీ సత్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సర్జరీ చేయించుకోవడానికి కారణం ఏంటో రివీల్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ చాన్సుల కోసం ఎక్కడికి వెళ్లినా నా లిప్ చిన్నగా ఉండటం వల్ల చిన్న పిల్లలాగా ఉన్నావని అన్నారు. ఆఫర్లు ఇవ్వట్లేదు అందుకే లిప్‌కు సర్జరీ చేయించాను.

కానీ అది పర్మినెంట్ కాదు. మూడు నెలల తర్వాత సెట్ అవుతుంది. ఐతే సినిమా వాళ్ళు చూసి ఇప్పుడు బాగుంది అంటున్నారు. ఈ లిప్ ఫిల్లింగ్ అనేది తొందరలోనే పోతుంది. అప్పటి వరకు ట్రోల్స్ భరించక తప్పదు అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పెళ్లి, ఇష్టాల గురించి పలు విషయాలు యాంకర్ అడగ్గా.. అసలు పెళ్లే చేసుకోను.. ఫీలింగ్స్ చచ్చిపోయాయి. కే-డ్రామాస్ ఫాంటసీ అంటే ఇష్టం.. వాళ్ళ ప్రేమించుకునే విధానం చాలా బాగుంటుంది. అయితే కొందరు నాకు ఆటిట్యూడ్ అంటారు కానీ అలా ఉండను. కొంచెం భయం ఉంటుంది అంతే. ఇక ఫ్రెండ్షిప్‌లో నటించడం రాదు ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే వదిలిపెట్టను’’ అని పలు విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీసత్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed