అరుంధతి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Jakkula Samataha |
అరుంధతి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా : ఒసేయ్ అరుంధతి.. అనే డైలాగ్ ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ డైలాగ్‌కు ఉన్న పవర్ అలాంటిది. టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్‌గా చేసిన మొదటి సినిమా అరుంధతి. ఈ సినిమాలో స్వీటీ శెట్టి జేజమ్మ గా కనిపించి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమా అనుష్క కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పవచ్చు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది. అంతే కాకుండా ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా తమ పాత్రలకు ప్రాణం పెట్టి చేశారు అనడంలో అతిశయోక్తి లేదు. సోనూసూద్ పశుపతి పాత్రలో అదరగొట్టాడు. అంతే కాకుండా అరుంధతి చిన్నప్పటి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నగేష్ నటించి తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాన్ని బంధించడిరా.. అంటూ తన డైలాగ్, నటన , అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది దివ్య.. ఇక ఈ సినిమా తర్వాత ఈ చిన్నది ఎక్కువగా వెండితెరపై కనిపించలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఈముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది.

ఆమె లేటెస్ట్ ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో చిన్నారి జేజమ్మ ఇంతలా మారిపోయిందా అంటున్నారు నెటిజన్స్.. స్టార్ హీరోయిన్‌కు ఏ మాత్రం తగ్గని కట్ అవుట్‌తో దివ్యా చాలా అందంగా ఉన్నదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ, మలయాళంలో సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed