ఇంకా బతికే ఉన్నారా..? హీరోపై ట్రోల్స్

by sudharani |   ( Updated:2023-04-01 09:11:12.0  )
ఇంకా బతికే ఉన్నారా..? హీరోపై ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆదిత్య ఓమ్. లవర్ బాయ్‌గా తెలుగు ప్రేక్షకులను విశేంగా ఆకట్టుకున్న నటుడు కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక కొన్నాళ్ల విరామం తర్వాత తాజాగా ‘దహనం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు ఆదిత్య. ‘దహనం’ మూవీ శుక్రవారం రిలీజ్ కావడంతో ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో తన ప్రయాణాన్ని గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘కెరీర్‌లో బ్రేక్ రావడంతో ట్రోలింగ్‌కు గురైనట్లు తెలిపాడు. మీరు బతికే ఉన్నారా అంటూ నెటిజన్లు కామెంట్ పెట్టేవారు. అప్పట్లో చాలా డిప్రెషన్‌లో ఉండేవాడిని. దాదాపుగా రోజుకి 60 సిగరెట్లు తాగేవాడిని. కానీ 2017 ఇకపై ఎప్పుడు ధూమపానం, మద్యపానం చేయకూడదు అని ఫిక్స్ అయ్యా. చివరకు ఫ్యామిలి సపోర్ట్‌తో సులువుగా బయటపడ్డా. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే.. సినిమా రంగంలో ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాల్సిందే. ప్రశంసలకు పొంగిపోకూడదు.. విమర్శలకు కుంగిపోకూడదు’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: మునిపంపులలో బలగం సినిమా ప్రదర్శన

Advertisement

Next Story

Most Viewed