బాహుబలి కథకు అనుష్క వాల్యూ ఇవ్వలేదట.. ఇన్నాళ్లకు రివీల్ చేసిన రాజమౌళి!

by Hamsa |   ( Updated:2023-11-10 05:25:21.0  )
బాహుబలి కథకు అనుష్క వాల్యూ ఇవ్వలేదట.. ఇన్నాళ్లకు రివీల్ చేసిన రాజమౌళి!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి’ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ డార్లింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్‌లో ఎన్నో సినిమాలు ఉండొచ్చు కానీ అన్నిటికన్నా ది బెస్ట్ సినిమా ఏది అంటే అందరూ చెప్పే బాహుబలి. ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క, తమన్నాలు నటించారు. అయితే సినిమా మొత్తానికి అనుష్క పాత్ర హైలెట్ అవుతుంది. తాజాగా, బాహుబలి సినిమాలో అనుష్క నటించడానికి కారణాన్ని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా రివీల్ చేశారు. ‘‘ఈ సినిమా కథను అనుష్కకు చెప్పినప్పుడు ఆమె వేరే ఆలోచన లేకుండా ఓకే చేసింది. రెమ్యునరేషన్ కూడా అస్సలు అడగలేదు.

అనుష్క సినిమా చేసింది నా కోసం.. నా కథ నచ్చి కాదు. ప్రభాస్, శ్రీవల్లి, రమా అందరూ తనకు మంచి ఫ్రెండ్స్ అని వీళ్లందరూ సినిమా షూట్‌లో బాగా ఎంజాయ్ చేస్తే నేను ఒక్కదాన్నే దూరంగా ఉండి ఫీల్ అవ్వాలా? అని చేసింది. ఈ విషయం నాకు స్వయంగా అనుష్కనే చెప్పింది. దీంతో అప్పుడు అర్థం అయింది నా కథకు అస్సలు అనుష్క వాల్యూ ఇవ్వలేదు. ఫ్రెండ్షిప్‌కి వాల్యూ ఇచ్చిందని అంటూ జక్కన్న ఫన్నీగా’’ చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అనుష్క ఫ్రెండ్స్ కోసం ఓ సినిమా చేసిందా అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story