ఇది నా మనసుకు దగ్గరైన చిత్రం: అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasanna |   ( Updated:2022-12-22 07:20:54.0  )
ఇది నా మనసుకు దగ్గరైన చిత్రం: అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : ఇప్పటి వరకు తాను నటించిన లవ్ స్టోరీల్లో '18 పేజేస్‌' బాగా నచ్చిందని చెప్పింది యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. నిఖిల్‌ సిద్దార్థ్‌కు జోడిగా కనిపించిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. కథ వినగానే ఎగ్జయింట్‌గా అనిపించి వెంటనే ఒప్పుకున్నానని, నందిని అనే సాధారణ యువతి పాత్ర అందరికీ నచ్చుతుందని తెలిపింది. ''18 పేజెస్‌' అనేది క్రేజీ లవ్‌ స్టోరీ. 2020 లాక్‌డౌన్‌లో సూర్యప్రతాప్‌ ఈ కథ చెప్పారు. నా మనసుకు దగ్గరైన చిత్రం ఇది. సెల్‌ఫోన్‌, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే యువతి పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. నిఖిల్‌తో ఒకేసారి రెండు సినిమాల ప్రయాణం సంతోషంగా అనిపించింది. ఈ చిత్రంతో మరో సక్సెస్‌ కొడతామనే నమ్మకం ఉంది' అంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు దర్శకత్వం వహించాలనే ఆలోచన కూడా ఉందన్న నటి.. ఇందుకు సంబంధించిన శిక్షణ తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించాడు.

Also Read..

'పుష్ప 2' లో Sai Pallavi పాత్రలో మరో హీరోయిన్ ప్లాన్

Advertisement

Next Story

Most Viewed