Keerthi Pandian : పెళ్లి చేసుకోబోతున్న మరో సెలబ్రిటీ జంట!

by Hamsa |   ( Updated:2023-08-14 09:38:34.0  )
Keerthi Pandian : పెళ్లి చేసుకోబోతున్న మరో సెలబ్రిటీ జంట!
X

దిశ, సినిమా: కోలీవుడ్‌లో మరోక ప్రేమ జంట పెళ్లికి సిద్ధమైంది. వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అశోక్ సెల్వన్.. త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సెల్వన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తమిళ సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్. ఆమె కూడా హీరోయినే. అయితే కీర్తి పాండియన్, సెల్వన్ కలిసి ప్రస్తుతం ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకముందే ఇద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 13న వీరిద్దరి వివాహ వేడుక జరగనుందట.

Read More: ‘ఆపరేషన్ వాలెంటైన్’ గా రాబోతున్న వరుణ్ తేజ్.. టైటిల్‌తోనే ఆసక్తిని పెంచేసిన మెగా హీరో

Next Story

Most Viewed