మాల్వీ మల్హోత్రాకు మరో బిగ్ ట్విస్ట్.. యోగేష్ తల్లి చేసిన పనికి నెటిజన్లంతా షాక్

by Anjali |   ( Updated:2024-07-17 06:20:13.0  )
మాల్వీ మల్హోత్రాకు మరో బిగ్ ట్విస్ట్.. యోగేష్ తల్లి చేసిన పనికి నెటిజన్లంతా షాక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్.. ప్రేయసి లావణ్య లవ్ ఎఫైర్ రోజుకో మలుపు తిరుగుతుంది. లావణ్య.. రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేయడంతో ఒక్కసారిగా వీరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపింది. 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని, రాజ్ తరుణ్‌కు తనకు పెళ్లైపోయిందని, కానీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగా దూరమయ్యాడని ఆయన నాకు కావాలంటూ లావణ్య ఫిర్యాదులో తన బాధ వెల్లగక్కింది. కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా లావణ్యకు నోటీసులు పంపించారు. తర్వాత రాజ్ తరుణ్‌లో నిజంగానే రిలేషన్ ఉన్నట్లు లావణ్య ఆధారాలు చూపించాక.. విచారణకు హాజరు కావాలని హీరోకు నోటీసులు పంపించారు. ఈ క్రమంలో మాల్వీ మల్హోత్రా గతంలో యోగేష్ అనే అబ్బాయిని ప్రేమించిందంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

వీరిద్దరి మధ్య పలు గొడవలు రాగా.. మాల్వీపై యోగేష్ కత్తితో దాడి చేశాడట. మూడు సార్లు కత్తితో పొడిచాడంటాడట. దీంతో యోగేష్ మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారట. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూ నడుస్తుండగా.. మాల్వీ మల్హోత్రా గతంలో నా కొడుకుని ట్రాప్ చేసిందంటూ యోగేష్ తల్లి సంచలన నిజాలు బయటపెట్టింది. నా కొడుకు దగ్గర చాలా మనీ తీసుకుందని, తమ ఆస్తులు కాజేసిందంటూ చెప్పుకొచ్చింది. మాల్వీ-యోగేష్ లవ్‌లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నటువంటి వీడియో, ఆడియో కాల్స్ రికార్డింగ్స్, ఫొటోలు పోలీసులకు చూపించి కంప్లైంట్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు. దీంతో పోలీసులు హీరోయిన్‌పై మరో కేసు నమోదు చేశారట. పాపం మాల్వీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయంటూ.. మరోవైపు సంచలన నిజాలు బయటపడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed