- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడుగడుగునా పోటీ పడాల్సి వస్తుంది.. ఇండస్ట్రీ కష్టాలపై అంజలి
దిశ, సినిమా : పరిశ్రమలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడానికి చాలా కష్టపడుతున్నానంటోంది అంజలి అరోరా. ఇందుకోసం అడుగడుగునా పోటీ పడాల్సి వస్తుందన్న ఆమె.. ఇంతకుముందు తనను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చూసేవారని, 'బిగ్ బాస్' రియాలిటీ షో తర్వాత తనపట్ల ప్రజల అభిప్రాయం మారిపోయిందని చెప్పింది. 'ఇప్పుడు నన్ను గొప్ప నటిగా పరిగణిస్తున్నారు. నా సామర్థ్యాన్ని గుర్తించి నా పనితనం గురించి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో చాలా కాలంగా పనిచేస్తున్న వారు కూడా నన్ను పోటీగా చూడటం మొదలుపెట్టారు.
అలా ఎందుకు భావిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏదీ సులువు కాదు. అనుకున్నదాని కంటే ఎక్కవ కష్టపడితేనే ఫలితాలొస్తాయి. నేను అదే చేస్తున్నా. నా ప్రేక్షకులు సంతోషంగా ఉన్నారు. వాళ్లను నిరాశపరచకుండా చూసుకుంటా. నా లోపాలను గమనిస్తూ తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి కృషి చేస్తున్నా. నా వ్యక్తిత్వంతో పాటు నా కళను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేయని రోజు లేదు. ఖచ్చితంగా మరింత మెరుగుపడతా. దేని గురించి బయటకు చెప్పడానికి వెనుకాడను. ప్రతిచర్యల గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో ట్రోల్స్ పరిశ్రమలో భాగం. కాబట్టి వాటి గురించి కలత చెందను' అంటూ తన ఫీలింగ్స్‌ను బహిర్గతం చేసింది.