యానిమల్ మూవీ సీన్ రిపీట్.. భావోద్వేగానికి గురిచేస్తోన్న బాలయ్య-భువనేశ్వరీల బంధం?

by Jakkula Samataha |
యానిమల్ మూవీ సీన్ రిపీట్.. భావోద్వేగానికి గురిచేస్తోన్న బాలయ్య-భువనేశ్వరీల బంధం?
X

దిశ, సినిమా : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నారా అభిమానులు, కుటుంబ సభ్యుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయితే ప్రమాణ స్వీకారానికి ముందే ఆ వేదికపై ఆత్మీయ అనుబంధాలు వెల్లివిరిశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకలో యానిమల్ మూవీ సీన్ రిపీట్ అయ్యింది అంటూ కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు నందమూరి బాలకృష్ణ, అందరు చూస్తుండగానే తన చెల్లి, భువనేశ్వరిని పలకరిస్తూ.. తలపై నిమిరి, నుదిటిపై ముద్దు పెడుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో భువనేశ్వరి కూడా అన్న ప్రేమను ఆస్వాధిస్తూ నవ్వుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఆ స్టేజ్ పై ఆత్మీయతలు వెళ్లి విరిశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే యానిమల్ మూవీలో కూడా ఇలాంటి సీన్ ఉంటుంది. తన హీరో చెల్లి ఒక చెట్టు వద్ద ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడు ఆయన వచ్చి తన చెల్లి ప్రేమగా తల మీద నిమిరి, నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు. సేమ్ అలాంటి సీన్‌నే ప్రమాణ స్వీకార వేడుకపై జరగడంతో కొందరు యానిమల్ సీన్ రిపీట్ అంటూ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed