నువ్వు పోర్న్ గర్ల్‌వా! దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న యానిమల్ బ్యూటీ..

by sudharani |   ( Updated:2024-07-11 14:17:11.0  )
నువ్వు పోర్న్ గర్ల్‌వా! దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న యానిమల్ బ్యూటీ..
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ‘యానిమల్’ మూవీతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో అమ్మడు బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించి కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే వరుస మూవీస్‌తో సందడి చేస్తున్న ఈమె.. ప్రజెంట్ ‘బ్యాడ్ న్యూస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్ లీడ్ రోల్‌గా నటించగా.. త్రిప్తి డిమ్రి, అమీ వర్క్ హీరోయిన్స్‌గా అలరించనున్నారు. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్నారు చిత్ర బృందం.

ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘జానమ్’ అనే సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రజెంట్ సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఈ సాంగ్‌లో త్రిప్తి మరింత తెగించి అందాలు చూపించింది. అంతేకాకుండా బోల్డ్ సన్నివేశాలతో రచ్చ చేసింది. ఇందులో ఎక్కువగా బెడ్రూమ్ సీన్స్ ఉండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో త్రిప్తిపై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఈ పాటకు ‘వల్గర్’ అనే ట్యాగ్‌ను జోడించి.. హీరోయిన్‌ను నువ్వు పోర్న్ గర్ల్‌వా అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. ‘బ్యాడ్ న్యూస్’ మూవీ జూలై 19న విడుదల కాబోతుంది.

Advertisement

Next Story