‘భగవంత్ కేసరి’లో KCPD అర్థం ఏంటో చెప్పేసిన అనిల్ రావిపూడి.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-10-19 14:14:20.0  )
‘భగవంత్ కేసరి’లో KCPD అర్థం ఏంటో చెప్పేసిన అనిల్ రావిపూడి.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీ లీల అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. నేడు ఈ సినిమా గ్రాండ్‌గా థియేరట్స్‌లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ ట్రైలర్‌లో ఓ డైలాగ్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ‘అబ్జల్యూట్ కేసీపీడీ బాబు’ అంటూ శుక్లా జీ (జాన్ విజయ్) చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్ అయ్యింది.

తాజాగా, KCPD అనే పదానికి అర్థం ఏంటో డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘KCPD పదంలో K అంటే కేసరి, C అంటే చిచ్చా, P అంటే పండగ, D దావత్.. మొత్తం కలిపితే ‘కేసరి చిచ్చా పండగ దావత్’ అన్నమాట. దసరా పండుగకు ‘భగవంత్ కేసరి’ వచ్చాడు కాబట్టి.. ఈ పండక్కి ఆయన దావత్ ఇస్తున్నాడు అన్నమాట. అని డైరెక్టర్ పోస్టులో వివరించారు. దీంతో ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే బాలయ్య ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story