టాలీవుడ్ డైరెక్టర్‌తో యాంకర్ పెళ్లి.. నెట్టింట ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2024-03-01 15:01:45.0  )
టాలీవుడ్ డైరెక్టర్‌తో యాంకర్ పెళ్లి.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. బ్యాచులర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి.. ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ కూడా వివాహం చేసుకున్నాడు. అతడు ఎరవంటే.. డైరెక్టర్ కిశోర్ రెడ్డి. శర్వానంద్ హీరోగా వచ్చిన ‘శ్రీకారం’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ‘లవ్.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి’ వంటి మూవీస్‌తో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్టర్ కిశోర్ రెడ్డి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తెలుగు యాంకర్ క‌ృష్ణ చైతన్యతో మార్చి 1 తెల్లవారుజామున హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వివాహం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

హోంగార్డు నన్ను పచ్చి బూతుమాట అన్నాడు.. సౌమ్య జాను!

Advertisement

Next Story