హెబ్బా పటేల్‌ని అడగకూడని ప్రశ్న అడిగిన యాంకర్.. కోపంతో ఏం చేసిందంటే? (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-08 11:26:52.0  )
హెబ్బా పటేల్‌ని అడగకూడని ప్రశ్న అడిగిన యాంకర్.. కోపంతో ఏం చేసిందంటే? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్‌‌ కొందరు నెటిజన్ల కామెంట్ల వల్ల కూడా పలువురు ట్రోల్స్‌తో బాధపడుతున్నారు. అయితే ముఖ్యంగా యాంకర్స్ ఏ విధంగా ఆడేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డబుల్ మీనింగ్‌ ప్రశ్నలతో యాంకర్స్.. పలువురు స్టార్ సెలబ్రిటీస్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా, యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్‌ ‘ద గ్రేట్ ఇండియా సూసైడ్’ ప్రమోషన్స్‌లో చేదు అనభవం ఎదురైంది. ఓ ఛానల్ ఇంటర్వ్యూ కి అటెండ్ అవుతుంది. అయితే యాంకర్ ను అడగరాని ప్రశ్న అడగడంతో ఆమె కోపం లేచి వెళ్ళిపోయింది. మీ మూడ్ బాగుందా? అని డైరెక్ట్‌గా అడిగేశాడు. అది హెబ్బా పటేల్‌కు అర్థం కాలేదు. దీంతో యాంకర్ గుచ్చి గుచ్చి అదే ప్రశ్నను అడగడంతో ఆమెకు చిరాకు వచ్చి వైకు విసిరికొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story