- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు కాబోయే భర్తను పరిచయం చేసిన యాంకర్ రష్మి.. అతనెవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ మొదట జబర్దస్త్ షోతో ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ చేసి అలరించింది. పెద్దగా ఫేమ్ రాకపోవడంతో బుల్లితెరపై ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ చేస్తుంది. అయితే ఒకప్పుడు జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన షోస్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అంతేకాకుండా ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. వీరిద్దరు షోలో భాగంగా జంటగా కనిపించారు.
అలాగే ఎన్నోసార్లు స్టేజ్‌పై పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో ఈ జంట ప్రేమించుకుంటున్నారని త్వరలో రియల్‌లైఫ్‌లో పెళ్లి చేసుకుంటారని గత కొద్ది కాలంగా వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజం కాదని వీరిద్దరు ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ పెళ్లి వార్తలు ఆగడం లేదు. కాగా, త్వరలో కొత్త సంవత్సరం రాబోతుండటంతో ‘రష్మి పెళ్లి పార్టీ’ అనే పేరుతో ప్రముఖ ఛానల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. తాజాగా, దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో రష్మీ తనకు కాబోయే వ్యక్తిని పరిచయం చేసింది. అందులో ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలాగే ఉండాలని కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి.
నా ఇమాజినేషన్‌లో ఉన్న వ్యక్తి ఇతనే అని రష్మి ఓ వ్యక్తిని పరిచయం చేసింది. అయితే అతను క్లీన్ షేవ్‌లో, హైట్ పర్సనాలిటీతో రొమాంటిక్ బాయ్‌లా ఉన్నాడు. పిల్లి కళ్లు, పూర్తి వైట్‌గా ఉన్నాడు. చూడటానికి ఫారెన్ కుర్రాడిలా ఉన్నాడు. మంచి హ్యండ్సమ్‌గా ఉన్నాడు. అయితే ఈ ప్రోమో చూసిన వారు ఇది కూడా టీఆర్‌పీ రేటింగ్ కోసమే అని అంటున్నారు. మరికొందరేమో.. నిజంగానే రష్మి అతడిని పెళ్లి చేసుకుంటే.. సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటని కామెంట్లు చేస్తున్నారు.