- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అనసూయ.. అందుకే అలా చేస్తున్నా అంటూ ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ నటిగా దూసుకుపోతుంది. పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి స్టార్ హీరోయిన్‌కు తీసిపోనంత క్రేజ్ సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల అనసూయ పెదకాపు, విమానం, రజాకార్ వంటి చిత్రాలతో అలరించింది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తనకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపి షాకిచ్చింది. అందంగానే ఉన్నారు కదా.. డైటింగ్ ఎందుకు చేస్తున్నారు అని యాంకర్ అడగడంతో.. ‘‘ నేను అందంగా కనిపించడానికి చేయట్లేను. హెల్త్ పరంగా ఎలా ఫీలవుతున్నాను అనే దాని కోసం డైట్ చేస్తున్నా. నాకు బ్రీతింగ్ సమస్య వల్ల హాస్పిటల్‌లో ఆక్సిజన్ పెట్టాల్సిన స్టేజ్ వరకు పరిస్థితి వెళ్లింది. హెల్త్ పరంగా చాలా సీరియస్ అయింది. నేను ఎక్కువగా ఎమోషనల్ అయితే కండరాల్లో నొప్పులు కూడా వస్తాయి. అందుకే నేను బ్రీతింగ్, యోగ, ప్రాణాయామం చేస్తున్నాను.
వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేశాను. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటేనే మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉంటాం. అందుకే మీరు నన్ను రకరకాల షేపుల్లో చూస్తుంటారు. నా చిన్న కొడుకు పుట్టిన తర్వాత విపరీతంగా బరువు పెరిగి పోయాను. నేను లావుగా ఉన్నాను అని ఫీల్ కాలేదు. కానీ హెల్త్ పరంగా ఏమైనా సమస్యలు వస్తాయని అనుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ అయ్యే అంత యాక్టీవ్ ఉండే అనసూయకు అలాంటి సమస్యలు ఉన్నాయా? అని అంటున్నారు.
Read More...
ఏం రాధికా మస్తున్నావు లే..గ్రీన్ చుడిదార్‌లో టిల్లు బ్యూటీ అందాల విందు!