‘నేనొక సైకో గర్ల్ ఫ్రెండ్‌ను.. నా లవర్‌ను వెంటాడుతుంటా’.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-12-25 14:01:09.0  )
‘నేనొక సైకో గర్ల్ ఫ్రెండ్‌ను.. నా లవర్‌ను వెంటాడుతుంటా’.. హీరోయిన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా : అనన్యా పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్ మెయిన్ లీడ్‌లో నటించిన చిత్రం ‘Kho Gaye Hum Kaha’. నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌గా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉన్న తమ క్యారెక్టర్‌లోని విశేషాలను పంచుకోవాలని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగాడు. దీనిపై స్పందించిన సిద్ధాంత్, ఆదర్శ్.. చిత్రంలోని పాత్రకు నిజ జీవితానికి పోలిక లేదని చెప్పారు. కానీ అనన్య మాత్రం తాను ఇందులో సైకో అబ్సెసివ్ స్టాకర్ గర్ల్ ఫ్రెండ్ అని.. రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉంటానని తెలిపింది. ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పుకొచ్చింది.

కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘పాపం ఆదిత్యా రాయ్ కపూర్‌కు బాధలు బాగానే ఉన్నట్లున్నాయ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆదిత్య-అనన్య మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వీరిద్దరి ఫారిన్ ట్రిప్స్‌కు సంబంధించిన ఇమేజెస్ కూడా నెట్‌లో హల్ చల్ చేశాయి.

Advertisement

Next Story