స్టార్ హీరోతో అనన్య సీక్రెట్ డేటింగ్.. ఫొటోలు వైరల్

by srinivas |   ( Updated:2022-10-20 13:54:43.0  )
స్టార్ హీరోతో అనన్య సీక్రెట్ డేటింగ్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట అనన్యపాండే, ఆదిత్య రాయ్ కపూర్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరి క్లోజ్‌నెస్‌కు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట హల్ చల్ చేస్తుండగా ఒకరినొకరు విపరీతంగా ఇష్టపడుతున్నారని, కొద్దిరోజులుగా డేటింగ్ చేస్తున్నారని నెటిజన్లు చర్చిస్తున్నారు. విషయానికొస్తే.. గత రాత్రి కృతి సనన్ సోదరి నూపూర్ సనన్‌తో కలిసి ముంబైలోని తన కొత్త నివాసంలో దివాళీ పార్టీ నిర్వహించింది.

ఈ ఈవెంట్‌‌కు పలువురు సెలబ్రిటీలతోపాటు అనన్య, ఆదిత్య కూడా హాజరయ్యారు. అయితే పార్టీలో ఇద్దరూ ఒకే దగ్గర కూర్చోవడం, కలిసి తిరగుతూ బాగా క్లోజ్‌గా మూవ్ అవుతుండటం కనిపించారు. ఈ క్రమంలోనే అంగద్ బేడీ, నేహా ధూపియాతో కలిసి దిగిన సెల్ఫీలో ఒకరినొకరు మరింత ఆప్యాయంగా చూసుకోవడం డేటింగ్ పుకార్లకు దారితీసింది. దీంతో 'కాఫీ విత్ కరణ్ 7'లో భాగంగా ఓసారి ఆదిత్య మాట్లాడుతూ అనన్య అంటే ఇష్టమని, ఆమె కూడా తనను ఇష్టపడుతుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ వీరి బంధానికి మరింత బలాన్ని చేకూర్చుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

1.సోదరికి జాన్వీ డేటింగ్ అడ్వైజ్.. వాళ్లతో జాగ్రత్త అంటూ

Advertisement

Next Story

Most Viewed