రాధిక అంటూ క్యూట్ గా పిలిచినా అనంత్ అంబానీ.. ఇదిగో వీడియో

by Prasanna |   ( Updated:2024-07-16 06:40:08.0  )
రాధిక అంటూ క్యూట్ గా పిలిచినా అనంత్ అంబానీ.. ఇదిగో వీడియో
X

దిశ, సినిమా: ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసిన అంబానీ ఇంట జరిగిన పెళ్లి ఫొటోలే వైరల్ అవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకున్న విషయం మనకీ తెలిసిందే.

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 12న జరిగిన ఈ వివాహానికి సినీ తారలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ప్రపంచ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, హాలీవుడ్ తారలు కూడా హాజరై సందడి చేశారు. పెళ్లికి ముందు వారం రోజుల ముందు బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా అంబానీ ఇంట్లోనే ఉన్నారు. అయితే, ఈ పెళ్ళికి సంబందించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

పెళ్లి వేడుకలో అనంత్ అంబానీ, రాధిక రాధిక అంటూ ముద్దుగా పిలిచినా వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో పోస్ట్ చేసి 24 గంటలు కూడా కాకుండానే 19 లక్షలకు పైగా వ్యూస్, లక్షల పైగా లైక్స్, వేల కామెంట్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన నెటిజెన్స్ మీ జోడి సూపర్, పుడితే అంబానీ ఫ్యామిలీలో పుట్టాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(Video Link Credits to abpliveentertainment Instagram channel)

Advertisement

Next Story