Airport లో Sruthi Hassan వెంటపడిన గుర్తుతెలియని వ్యక్తి.. భయంతో పరుగులు..

by sudharani |   ( Updated:2023-09-21 12:57:06.0  )
Airport లో Sruthi Hassan వెంటపడిన గుర్తుతెలియని వ్యక్తి.. భయంతో పరుగులు..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌ పోర్టు లోపలి నుంచి కారు ఎక్కే వరకు ఆమెను ఓ వ్యక్తి వెంబడించాడు. ఇదే విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్న శృతి.. ‘నేను ఎయిర్‌పోర్టులో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి నా వెంట రావడం గమనించాను. ఫొటో కోసం అనుకున్నాను కానీ అంతలో ఫొటోగ్రాఫర్స్ అతన్ని పక్కకు వెళ్లి నిల్చోమని చెప్పారు. కానీ అతను నాకు చాలా దగ్గరగా రావడంతో అసౌకర్యంగా అనిపించింది. అందుకే అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయా. నాకు వ్యక్తిగత బాడీగార్డులను పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నా జీవితాన్ని స్వేచ్ఛగా జీవించాలనుకుంటాను. అందుకే ఇప్పటి వరకు బాడీ గార్డ్స్‌ను పెట్టుకోలేదు. కానీ, ఇప్పుడు ఈ సంఘటన తర్వాత బాడీ గార్డ్స్‌ గురించి ఆలోచించాలేమో’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : విమానాశ్రయంలో శృతి హాసన్ వెంటపడిన గుర్తుతెలియని వ్యక్తి.. భయంతో పరుగులు..

Advertisement

Next Story