- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ రోజున అమ్మకు మర్చిపోలేని గిఫ్ట్.. పరిణితీ చోప్రా
దిశ, సినిమా: పరిణీతి చోప్రా 2012 సంవత్సరంలో ‘ఇషాక్జాదే’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో అర్జున్ కపూర్ హీరోగా నటించాడు. తన 12 ఏళ్ల కెరీర్లో 8 ఫ్లాప్ చిత్రాలను అందుకుంది. పరిణీతి ఎన్నో జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నామినేషన్లు అందుకున్నారు. చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఆమెకు తన తల్లి రీనా చోప్రా అంటే అపారమైన ప్రేమ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. 'అమ్మ నాకు మంచి ఫ్రెండ్. నాపై ఆమె చూపిస్తున్న ప్రేమను జీవితంలో మర్చిపోలేను. తనకెప్పుడూ రుణపడి ఉంటాను. మా అమ్మది చిన్న పిల్లల మనస్తత్వం. ఇప్పటికీ నేనే చాలా నేర్పుతుంటాను.
కొన్ని సందర్భాల్లో నేను తల్లిగా, ఆమె కూతురిగా మారిపోతుంటాం. నాకు స్కూబా డైవింగ్ బాగా వచ్చు. అమ్మకి కూడా నేర్పించా. అంతేకాదు, భౌతికంగా ఇద్దరం దూరంగా ఉన్నా. ఆన్లైన్లో కలిసే ఉంటాం. దూరంగా ఉండి కూడా గేమ్స్ ఆడుకుంటాం. ఈ నెల 12న మదర్స్ డే. ఆ రోజున అమ్మకు గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అదేంటో ఇప్పుడే చెప్పను.. సస్పెన్స్’ అని చెప్పుకొచ్చింది పరిణితి చోప్రా.
Read More...
రూ. 2 కోట్ల యాడ్‌ను ఈజీగా తిరస్కరించిన స్టార్ హీరోయిన్.. అందుకు ఆమె చెప్పిన కారణం తెలిస్తే షాక్ అవుతారు..?