అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకున్న పోలీస్ పిలక వీడియో

by Hamsa |   ( Updated:2023-05-19 07:04:40.0  )
అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకున్న పోలీస్ పిలక వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి కావడంతో గత కొద్ది రోజుల నుంచి భానుడి భగభగలకు ప్రజలు జంకుతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వడగాలి కూడా పెరిగిపోతోంది. దీంతో వాతావరణ శాఖ ప్రజలను ఇంట్లోనే ఉండాలని నిత్యం హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎండలను తగ్గుకునేందుకు చాలా మంది అనారోగ్యానికి గురికాకూడదని పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వేసవిలో వేడికి కొంత మంది ఎండలో పలు ప్రయత్నాలు చేసిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా, అలాంటి ఫన్నీ వీడియో ఒకటి బాలీవుడ్ సీనియర్ హీరో అమితా బచ్చన్ షేర్ చేశారు. అందులో ఓ పోలీస్ జుట్టును పిలక కట్టుకొని దానిని గుడ్రంగా తిప్పుతూ చేతిలో సంచి పట్టుకుని ఫాస్ట్‌గా వెలుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే వేడిని తట్టుకునేందుకు అలా చేస్తునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more: అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఏక్తాకు చోటు.. ఏకైక భారతీయురాలిగా రికార్డ్

High Tention: అటు తాత, ఇటు భార్య... ఎటూ తేల్చుకోలేకపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఓటు ఎవరికో..?

సల్మాన్ సోదరి ఇంట్లో చోరీ.. వజ్రాలతో చేసిన అభరణాలు మాయం

Advertisement

Next Story

Most Viewed