కడుపుతో ఉన్న అమలా పాల్ ఫోటోషూట్.. ఎంత అర్థవంతంగా ఉందో చూడండి..

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-28 08:45:43.0  )
కడుపుతో ఉన్న అమలా పాల్ ఫోటోషూట్.. ఎంత అర్థవంతంగా ఉందో చూడండి..
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ అమలా పాల్ రెండో పెళ్లి చేసుకున్నాక చాలా సంతోషంగా కనపడుతుంది. మ్యారేజ్ అయిన రెండు నెలలకే కడుపుతో ఉన్నానని శుభవార్త చెప్పిన ఆమె.. ఈ ప్రెగ్నెన్సీ జర్నీని చాలా బాగా ఆస్వాదిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కో ప్రెగ్నెంట్ లేడీస్ కు సూచనలు ఇస్తూ స్ఫూర్తి నింపుతుంది. కాగా అంగరంగ వైభవంగా శ్రీమంతం చేసుకున్న ఆమె.. మరికొద్ది రోజుల్లో బిడ్డకు వెల్ కమ్ చెప్పబోతుంది. ఈ క్రమంలో ఫొటో షూట్ నిర్వహించగా.. గ్రీన్ కలర్ డ్రెస్ లో పెద్ద పొట్టతో చూడ ముచ్చటగా కనిపిస్తుంది.

ఇక ఈ ఫోటోలు షేర్ చేసిన అమలా పాల్.. ఇంతకీ తనకు ఎవరు పుట్టబోతున్నారో గెస్ చేయమని అడిగింది. దీనిపై స్పందిస్తున్న అభిమానులు కచ్చితంగా కవలలు పుడతారని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు గర్ల్, బాయ్ ఎవరైనా సరే మీ అంత పాజిటివ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. కాగా అమలా పాల్ ముందుగా కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులకే ఆయన నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పూర్తిగా సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన అమె.. లాంగ్ టైం ఫ్రెండ్ ను రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.


Advertisement

Next Story

Most Viewed