పవన్ కళ్యాణ్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో కనిపించని అల్లు ఫ్యామిలీ.. ఆ కారణంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో కలవడం లేదా?

by Jakkula Samataha |
పవన్ కళ్యాణ్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో కనిపించని అల్లు ఫ్యామిలీ.. ఆ కారణంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో కలవడం లేదా?
X

దిశ, సినిమా : పిఠాపురం నియోజక వర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా, అత్యధిక మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖులు, సెలబ్రిటీస్, ఆర్టిస్టులు, అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపును ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంది. ఇక మెగా ఫ్యామిలీలో ఏ వేడుకలు జరిగినా, అల్లు ఫ్యామిలీ కూడా హాజరు అవుతూ ఉంటుంది. అయితే ఈసారి పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌కు అల్లు అర్జున్‌తో పాటు ఆయన ఫ్యామిలీ కూడా దూరంగా ఉంది. పవన్ బ్రదర్స్, సిస్టర్స్, అల్లులు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అలాగే వరుణ్, చరణ్, అందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయాన్ని ఎంజాయ్ చేశారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం ఈ వేడుకలకు అటెండ్ కాలేదు. దీంతో ప్రస్తుతం అందరినోట ఇదే ముచ్చట వినిపిస్తుంది. అల్లు అర్జున్, తన ఫ్యామిలీ ఈ వేడుకలకు హాజరు కాకపోవడ గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అయితే దీనికి ముఖ్యకారణం, మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు మధ్య ఉన్న గొడవలే అన్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, అల్లు అ్జున్ మెగా కాంపౌండ్ నుంచి బయటకు రావాలని ఆలోచిస్తున్నారని ఓ వార్త వైరల్‌గా మారింది.

అంతే కాకుండా ఎన్నికల ప్రచారం సమయంలో, అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ, ఆయన తరఫున ప్రపచారం చేయడం, దీనిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం, నాగబాబు కూడా మనోడే కానీ పగోడు అంటూ పరోక్షంగా బన్నీపై కామెంట్ చేయడం అప్పట్లో చర్చానీయాంశం అయ్యింది. దీంతో అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య ఓ యుద్ధమే జరిగింది అని చెప్పాలి. ఇక ఈ ఇష్యూ సమయంలోనే మెగా ఫ్యామిలీ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ లెఫ్ట్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఈ ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవలే జరుగుతున్నాయి అనుకున్నారు జనాలు. కానీ ఊహించని విధంగా పవన్‌కు బన్నీ విషెస్ తెలిపాడు. దీంతో అంతా సద్దుమణిగింది అనుకున్నారు. కానీ విన్నింగ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్, తన ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవడంతో మరోసారి వీరి మధ్య గొడవలు ఇష్యూ తెరపైకి వచ్చింది. కాగా, దీనిపై ఎవరు క్లారటీ ఇస్తారో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story