Allu Arjun :మెగా ఫ్యామిలీతో వివాదం.. అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం ఎక్కడుందో తెలుసా?

by Jakkula Samataha |
Allu Arjun :మెగా ఫ్యామిలీతో వివాదం.. అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం ఎక్కడుందో తెలుసా?
X

దిశ, సినిమా : ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు పడటం లేదని, అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య బంధాలు తెగిపోయాయంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు సుకుమార్‌కు కూడా పడటం లేదు, వీరి మధ్య కూడా గొడవలు జరగడంతో బన్నీ గడ్డం ట్రిమ్ చేశారంటూ అనేక వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల వీటిపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇటలీ వెళ్లారని, సుకుమార్, బన్నీ మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదు, ఐకాన్ స్టార్ హాలీడే టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ షూట్ చేయాల్సిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అవి తీయడానికి కాస్త టైం పట్టవచ్చును, దాదాపు నెల రోజుల వరకు టైం ఉంది. అందుకే బన్నీ గడ్డం ట్రిమ్ చేసి ఫ్యామిలీతో వేకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళీ వచ్చే వరకు గడ్డం పెరుగుతుంది. దీంతో సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆయన పేర్కొన్నారు. అలాగే మెగా ఫ్యామిలీతో గొడవలు గురించి మాట్లాడుతూ.. కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడం కామన్. కానీ అవన్నీ తొలగిపోవడానికి ఒక సిట్యువేషన్ వస్తుంది. దాని కోసమే వేయిట్ చేస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. కాగా, ఈ వివాదాల నేపథ్యంలోనే బన్నీ మైండ్ రిలీఫ్ కోసం ఫ్యామిలీని తీసుకొని వెకేషన్‌కు వెళ్లినట్లు సమాచారం.

Advertisement

Next Story