హీరోల రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్..! (వీడియో)

by Hamsa |   ( Updated:2023-11-07 13:35:22.0  )
హీరోల రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్’కు పరిచయం అక్కర్లేదు. ఆయన పలు చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా, ఆయన ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా టీజర్ లాంచ్‌కు హాజరై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే, గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి చిన్న చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఎందుకు రావడం లేదని అల్లు అరవింద్‌ను మీడియా ప్రతినిధి అడిగాడు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘ఈరోజు పెరిగిన నిర్మాణ వ్యయంలో హీరోలు తీసుకునేది అత్యధికంగా 20 నుంచి 25 శాతం. కాబట్టి హీరోల వల్ల కాస్ట్ పెరిగిపోతుంది అనడం కన్నా.. నిర్మాణ వ్యయం పెంచిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని నాకు అనిపిస్తుంది. పేర్లు చెప్తే బాగోదు.. కొన్ని సినిమా నిర్మాణ వ్యయాలు ఎంతున్నాయో మీరు గమనించండి.

ఆ వ్యయంలో హీరోల రెమ్యునరేషన్లు ఎంతున్నాయో మీరు లెక్కేసుకోండి. తక్కువే ఉన్నాయి. హీరోల వల్ల నిర్మాణ వ్యవయం పెరిగిపోయి నిర్మాతలు అంతా దూరంగా ఉంటున్నారు అని అనడం కరెక్ట్ కాదు. ఇవాళ పెద్దగా చూపిస్తే తప్ప పెద్ద సినిమాలను ఆదరించరు. హీరోలతో సంబంధం లేకుండా సినిమాను పెద్దగా చూపించాలి. కె.జి.యఫ్ రాకముందు అతను (యశ్) ఎవరండి? ఎంత పెద్ద హీరో అతను? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే ఆ సినిమా ఆడింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే’’ అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అది చూసిన యష్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story