- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Raj Tarun: కొత్త రూట్‌లో రాజ్‌తరుణ్, లావణ్యల వివాదం.. ప్రమోషన్ స్టంట్ అంటున్న పలువురు!
దిశ, సినిమా: గత కొంతకాలంగా రాజ్‌తరుణ్, లావణ్యల వివాదం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హడావుడి చేస్తున్నారు. రాజ్‌తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని.. అబార్షన్ కూడా చేయించాడని లావణ్య ఆరోపిస్తుంది. రాజ్‌తరుణ్ మాత్రం ఇదంతా అబద్దమే.. ఆమె కావాలని ఇలా చేస్తుందని.. నా దగ్గర సాక్ష్యాలున్నాయని, లీగల్‌గా ముందుకెళ్తానని చెబుతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న రాజ్‌తరుణ్ నేడు జరిగిన ‘తిరగబడర సామీ’ ప్రెస్‌మీట్‌కు.. ఈ వివాదంలో ఇన్‌వాల్వ్ అయిన మాల్వీ మల్హోత్రాతో కలిసి హాజరయ్యాడు. అంతేకాదు ఈ ప్రెస్‌మీట్ జరుగుతున్న ప్రసాద్ ల్యాబ్‌కు లావణ్య కూడా వచ్చి కాసేపు హల్‌చల్ చేసింది.
రాజ్‌తరుణ్‌తో మాల్వీ మల్హోత్రా ఎందుకు ఉందని.. ‘నన్ను వదిలేసి రాజ్ ఆమెతో ఎందుకు ఉంటున్నాడని అక్కడ నిలదీసింది’ కాగా రాజ్‌తరుణ్ నటించిన తాజా చిత్రం తిరగబడర సామీ ఈ శుక్రవారం విడుదలకు సిద్దమైంది. అయితే ఈ వివాదాన్ని పరిశీలించిన కొంత మంది మాత్రం ఇదంతా సినిమాకు బజ్ రావడానికి చేసిన ప్రమోషన్ పబ్లిసిటి స్టంట్ అని సందేహిస్తున్నారు. అయితే ఇటీవల డార్లింగ్ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా హీరో ప్రియదర్శి, నభా నటేష్ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని చివరగా ఇదంతా ప్రమోషన్ ప్లాన్ అని చెప్పారు. సో... ఇప్పుడు రాజ్‌తరుణ్, లావణ్య, మాల్వీ మల్హోత్రా ఈ వివాదం కూడా తిరగబడర సామీ ప్రమోషన్ కోసమే చేస్తున్నారేమో అని కొంత మంది అంటున్నారు. అయితే నిజంగా సినిమా ప్రమోషన్ కోసమే చేసిన స్టంట్ అయితే అందరూ హ్యపీయే కదా... కానీ చూద్దాం.. ఇది రియల్ ఇన్‌సిడెంటా? లేక సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రీల్ ఇన్‌సిడెంటా..!