ఆ విషయంలో హీరోయిన్ల యూనిటీపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-05-24 09:25:43.0  )
ఆ విషయంలో హీరోయిన్ల యూనిటీపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శృతిహాసన్. సీనియర్ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తన అందం, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు (Cannes 2023) వెళ్లిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

శృతి హాసన్ మాట్లాడుతూ.. ‘‘నిజంగా చెప్పాలంటే వ్యత్యాసం అనేది అన్ని చోట్లా ఉంది. మనమంతా సమానత్వం కోరుకుంటాం. కానీ మహిళల భద్రత, విద్య, ఆరోగ్యం ఇలాంటి ఎన్నో విషయాలు ఇంకా పరిష్కారంలోకి రాలేదు. ఇక సినిమా రంగానికి వస్తే చాలా సార్లు నేను కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాను. అలా అని ఎప్పుడూ బాధపడలేదు. ఇప్పటికే సినిమా రంగంలో ఎన్నో విషయాల్లో మార్పు మొదలైంది. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ అది కచ్చితంగా కొనసాగుతుంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో నటీమణులంతా కలిసికట్టుగా ఉండాలనేది నా అభిప్రాయం’’ అంటూ చెప్పుకొచ్చింది. శృతి హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More: పువ్వులా విచ్చుకున్న బ్లాక్‌ డ్రెస్‌లో టెంప్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్

Advertisement

Next Story