రామ్ చరణ్ గురించి అలియా భట్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
రామ్ చరణ్ గురించి అలియా భట్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ అలియా భట్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో కో స్టార్ ను ఆకాశానికి ఎత్తేసింది. 'RRR' సినిమా ప్రమోషన్స్ టైంలో తనను చాలా కేరింగ్ గా చూసుకున్నాడని.. 'ఎక్కడున్నాను? ఎలా ఉన్నాను? కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నానా లేదా?' అని చెక్ చేసేవాడని తెలిపింది. ఈరోజు అతను ఒక బెస్ట్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్తున్నాను అని.. ఒక యాక్టర్‌గా, పర్సన్‌గా అతను చాలా గొప్పవాడు అని చెప్పుకొచ్చింది.

ఇక ఒక సీన్ చేసే ముందు చాలా సైలెంట్‌గా అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తాడని.. ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా తన పని తాను చేసుకుపోతాడని తెలిపింది అలియ. ఒక సన్నివేశాన్ని చాలా డిగ్నిటీతో కంప్లీట్ చేసే ఆయన.. అదే సమయంలో కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ అందిస్తాడని అభిప్రాయపడింది. కాగా ప్రస్తుతం చెర్రీ 'గేమ్ చేంజర్' తో బిజీగా ఉండగా.. అలియా భట్ త్వరలో 'jigra' మూవీతో అలరించనుంది.

Advertisement

Next Story