రంజాన్ సందర్భంగా మెగాస్టార్‌ను కలిసిన అలీ సోదరులు

by sudharani |   ( Updated:2023-04-22 14:49:53.0  )
రంజాన్ సందర్భంగా మెగాస్టార్‌ను కలిసిన అలీ సోదరులు
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముస్లిం సోదరులందరికీ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు అలీకి అతడి కుటుంబ సభ్యులకు రంజాన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అలీ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.

అయితే.. నటుడు అలీ తనకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని అలీ అన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని ఆయన తెలిపారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి అలీ, అతడి కుటుంబ సభ్యులు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Also Read...

ఆ ఒక్క కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడంట!

Advertisement

Next Story