తారక్ ‘దేవర’ సినిమాలో అక్కినేని హీరో కీ రోల్?

by Prasanna |   ( Updated:2023-08-14 14:10:50.0  )
తారక్ ‘దేవర’ సినిమాలో అక్కినేని హీరో కీ రోల్?
X

దిశ, సినిమా: ప్రజంట్ తెలుగు స్టార్ హీరోలంతా కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ అక్కినేని హీరోలు మాత్రం వరుస ఫ్లాప్‌లు అందుకుని చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. నాగ చైతన్య, అఖిల్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సుమంత్, సుశాంత్ మాత్రం ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న ‘దేవర’ మూవీలో హీరో ఫ్రెండ్‌గా సుమంత్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం మొదట రానాను తీసుకోవాలని అనుకున్నారు. కానీ రానా కంటే కూడా ఈ క్యారెక్టర్‌లో సుమంత్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించినట్లుగా తెలుస్తుంది. సుమంత్ ఈ సినిమా ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Advertisement

Next Story