- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాధలో ఉన్న సమంతకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన అక్కినేని ఫ్యామిలీ.. ఖుషిలో ఫ్యాన్స్?
దిశ, సినిమా: టాలీవుడ్ క్యూట్ అండ్ స్టార్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని మంచి టాక్ తెచ్చుకున్నవే. ఇక ఏమాయ చేశావే చిత్రంలో అక్కినేని హీరోతో ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. సామ్ - నాగచైతన్య విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య సమంతతో పాటు తెలుగు ప్రజలందరికీ భారీ షాక్ ఇచ్చాడు. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకుని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ముందుగా ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికన ఫొటోలు షేర్ చేసి వెల్లడించారు.
తర్వాత నాగ చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కూడా చై-శోభితా ఎంగేజ్‌మెంట్ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. నాగచైతన్య -శోభితా వివాహం చేసుకుంటే సమంతకు చాలా మంచి జరుగుతుందంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే చై వేరే పెళ్లి చేసుకుంటాని ప్రకటించడం ప్రస్తుతం సామ్‌కు అక్కినేని ఫ్యామిలీ గుడ్‌న్యూసే అందించిందని, అసలు సామ్ బాధపడాల్సిన అవసరమే లేదంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే చైతన్యతో పెళ్లికి ముందు సమంతతో నటించడానికి అగ్ర హీరోలు సైతం ముందుకొచ్చేవారు. పెళ్లికి ముందు సామ్ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోయింది.
వివాహనంతరం సమంత అక్కినేని ఇంటి కోడలు కావడంతో రొమాంటిక్ గా నటించేందుకు కాస్త ఇబ్బంది పడేదని, అంతేకాకుండా దర్శక, నిర్మాతలు కూడా నాగార్జున కోడలు కావడంతో అలాంటి సినిమాల్లో నటించేందుకు అడగకపోవడం లాంటివి జరిగాయట. కాగా ఇప్పుడు చై పెళ్లైపోతుంది. సామ్ కెరీర్ మొదట్లో ఎలా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దుమ్మురేపిందో అలాగే దూసుకుపోవచ్చని, సామ్ ను ఇక ఆపేవారు లేరని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపై ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించొచ్చు, ఏ హీరోతోనైన కలిసి వర్క్ చేయవచ్చని, గతంలోలాగ సామ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయబోతుందని అంటున్నారు. కాగా చైతన్య పెళ్లే అక్కినేని ఫ్యామిలీ సమంతకు అందించిన భారీ గుడ్‌న్యూస్ అంటూ నెటిజన్లు సమంతకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు.