అమ్మాయిలు తప్పక చూడాల్సిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’

by Vinod kumar |
అమ్మాయిలు తప్పక చూడాల్సిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’
X

దిశ, సినిమా: శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్‌పై సుబ్బారెడ్డి నిర్మించిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు తెరకెక్కించిన ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో మాన్యం కృష్ణ, అర్చన హీరోహీరోయిన్లుగా నటించారు. కాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను నటుడు ఆకాశ్ పూరి చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆకాశ్ పూరి.. ‘మార్చి 10న విడుదల కాబోతున్న సినిమా ఘన విజయం సాధించాలి. దర్శక నిర్మాతలతోపాటు నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’ అన్నాడు. అలాగే మహిళలకు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయన్న చిత్ర బృందం.. అమ్మాయిలు తప్పక చూడాలన్నారు. ఇక సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed